420 హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలును విస్మరించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్, రైతులకు రుణమాఫీ, 500 రూపాయల పంట బోనస్ లాంటివి ఆరు గ్యారెంటీలలో లేవా? అని ఆయన ప్రశ్నించారు.
- హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్‌టౌన్, మే 10: అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలును విస్మరించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్, రైతులకు రుణమాఫీ, 500 రూపాయల పంట బోనస్ లాంటివి ఆరు గ్యారెంటీలలో లేవా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని 29వ వార్డులో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొని పలువురిని ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఆరు గ్యారెంటీల అమలు పచ్చి అబద్ధమన్నారు. జిల్లా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. పార్లమెంట్లో మాట్లాడి సమస్యల పరిషారానికి కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలు జరుగాలంటే బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 50 వేల మెజారిటీ పైచిలుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ఇద్దరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, స్థానిక కౌన్సిలర్ ముక్క రమేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

