Gambhiraopet | గంభీరావుపేట, జూలై 12 : గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హిమాన్షు బాబు జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. హిమాన్షు బాబు జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో అనాథ వృద్ధులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. అనంతరం వృద్ధుల సమక్షంలో కేకు కట్ చేశారు.
హిమాన్షు బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వృద్ధులు ఈ సందర్భంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సింగారం నాగరాజ్ గౌడ్, కరువారి శంకర్, చిట్టెంపల్లి భిక్షపతి, కల్వకుంట్ల కిషన్ రావు, ఇరిగి సందీప్, రాజు, శ్రీకాంత్, మక్బూల్, తదితరులు పాల్గొన్నారు.