రేవంత్ పాలనలో గోదావరి ఎడారి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్తున్న ఆయన, గోదావరిఖనిలోని గోదావరి వంతెనపై ఆగారు.
- మాజీ మంత్రి హరీశ్ రావు
గోదావరిఖని, జూలై 1: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్తున్న ఆయన, గోదావరిఖనిలోని గోదావరి వంతెనపై ఆగారు.
నీళ్లు లేక వెలవెలబోతున్న నదిని పరిశీలించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఎదురెక్కిన జలాలతో గోదావరి నది నాడు కళకళలాడిందని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎడారిగా మార్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని దుయ్యబట్టారు. ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్, బాల్క సుమన్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

