శంకరపట్నం, జూన్ 24: ‘బిడ్డా మళ్లీ నువ్వే గెలుస్తవ్’ అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను ఓ అవ్వ ఆశీర్వదించింది. మాజీ ఎమ్మెల్యే బుధవారం శంకరపట్నం మండలం గొల్లపల్లిలో గ్రామదేవతల ప్రతిష్ఠా పన మహోత్సవానికి హాజరై మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని పలుకరించగా, ఆసక్తికరంగా మట్లాడింది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నదని గుర్తు చేసుకున్నది. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ఆకాంక్షించింది. బిడ్డా నువ్వు మళ్లీ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నది.