Sunke Ravi Shankar | పంటలు ఎండిపోతున్న పట్టించుకోరా.. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
తీవ్రమైన కరెంటు కోతలతో పొట్ట దశకు వచ్చిన వరి పొలాలు ఎండిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆరుగాలాలు పండించిన పంట నేల పాలవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని, వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- చేతికొచ్చిన పంట నేల పాలవుతున్న కనికరం లేదా..?
- ఎండిన ప్రతీ ఎకరాకు రూ. 59 వేలు నష్టపరిహారం ఇవ్వాలి
- గంగాధర మండలంలో కరెంటు కోతలతో ఎండుతున్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
Sunke Ravi Shankar | గంగాధర, అక్టోబర్ 10 : తీవ్రమైన కరెంటు కోతలతో పొట్ట దశకు వచ్చిన వరి పొలాలు ఎండిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆరుగాలాలు పండించిన పంట నేల పాలవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని, వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలం గర్శకుర్తి, తాడిజెర్రి గ్రామాల్లో కరెంటు కోతలతో ఎండిపోతున్న వరి పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగుచేసిన పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కరెంటు కోతలతో రోజుకు రూ. 3 వేలు వెచ్చించి జనరేటర్లు అద్దెకు తీసుకొని పంట పొలాలకు నీరు పెడుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం 6 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. జలాశయాలు, బావుల్లో సమృద్ధిగా నీరున్న కరెంటు కోతలతో పంటలు ఎండే పరిస్థితి వచ్చిందన్నారు. కష్టం వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, మరో 15 రోజులు సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తే రైతుల నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి ఎండిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు కంకణాల విజేందర్ రెడ్డి, రామిడి సురేందర్, బొల్లాడి శ్రీనివాసరెడ్డి, మామిడిపల్లి అఖిల్, గుంటుకు ఆంజనేయులు, ఈర్ల మహిపాల్ రైతులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

