Vidyanagar | డివిజన్ల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లు : కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్

విద్యానగర్ : జిల్లాలో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గాంధీరోడ్లోని వైశ్యభవన్లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 58 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు డివిజన్ల వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధుల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్ తీసుకుని కొవిడ్ లేని జిల్లాగా మార్చాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ గరిమా అగర్వాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ జువేరియా, కార్పొరేటర్ పిట్టల వినోద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

