Ganneruvaram | నిలిచిపోయిన బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ధర్నా
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మండలకేంద్రం గన్నేరువరం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే బస్సు సర్వీసును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
Ganneruvaram | గన్నేరువరం, అక్టోబర్8 : కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మండలకేంద్రం గన్నేరువరం మీదుగా సికింద్రాబాద్ వెళ్లే బస్సు సర్వీసును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గన్నేరువరం నుండి బెజ్జంకి, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్, అలాగే కరీంనగర్ నుండి హన్మజిపల్లి మీదుగా మండలకేంద్రం గన్నేరువరనికి వచ్చే రెండు బస్సు సర్వీసులను రెండు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో కలిసి ప్రారంభించారని గుర్తుచేశారు.
అయితే, గత నాలుగైదు రోజుల నుంచి ఈ బస్సులు రావడం లేదని మండిపడ్డారు.ఆర్టీసీ బస్సుల రాకపోకలు మండల ప్రజలకు “మూన్నాళ్ల ముచ్చట”గా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి సరైన రోడ్డు బస్సులు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, నిత్యం ప్రయాణించే పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి, చొరవ తీసుకుని నిలిపివేసిన బస్సులను పునరుద్ధరించేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

