Chandurthi | అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దళిత యువకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు చింతపంటి రామస్వామిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Chandurthi | చందుర్తి, సెప్టెంబర్ 27 : Chandurthi భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దళిత యువకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు చింతపంటి రామస్వామిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలోని కోరుట్ల-వేములవాడ రహదారిపై ఆదివారం బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు రామస్వామి దళితుల పట్ల వివక్షతతో అహంకారపూరిత వ్యాఖ్యలతో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువకులను,అంబేద్కర్ పై పరుష పదజాలంతో మాట్లాడిన తీరు సభ్య సమాజాన్ని కలచి వేసిందని పేర్కొన్నారు.
రాజ్యాంగం ద్వారా కల్పించిన పదవులను చేపట్టి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్లు,ప్రభుత్వ పథకాలు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడడం తో పాటు దళితులను దూషించడం పట్ల తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బే షరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలతో పాటు ఈనెల 30న సిరిసిల్లలో నిర్వహించే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సై రమేష్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ డివిజన్ సంఘం అధ్యక్షుడు దమ్మ ఆనంద్, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ దప్పుల అశోక్, మాల డివిజన్ అధ్యక్షుడు బత్తుల కమలాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ భిక్షపతి, మండల అధ్యక్షుడు ఏసు కుమార్, కట్కూరి ప్రశాంత్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

