Godavarikhani | అభివృద్ధి పేరుతో గోదావరిఖనిలో వివాదాస్పదంగా చెట్ల నరికివేత
వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయని' అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యావరణ సందర్భంలో ప్రజలకు హితబోధ చేస్తుంటారు.. ఇవన్నీ ఉచిత సలహాలేనా..? ఆ సూచనలు ప్రజలకు తప్ప తమకు కాదన్నట్టుంది రామగుండం నగర పాలక అధికారుల ధోరణి.
- రామగుండం మున్సిపల్ అధికారులపై స్థానికుల నిలదీత
Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 13 : ‘వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయని’ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యావరణ సందర్భంలో ప్రజలకు హితబోధ చేస్తుంటారు.. ఇవన్నీ ఉచిత సలహాలేనా..? ఆ సూచనలు ప్రజలకు తప్ప తమకు కాదన్నట్టుంది రామగుండం నగర పాలక అధికారుల ధోరణి. పారిశ్రామిక ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజలకు నీడనిస్తూ, ప్రాణవాయువు అందించే వృక్షాల నరికివేత చర్యల పట్ల పర్యావరణ ప్రేమికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తా పోచమ్మ ఆలయం వద్ద 70 యేళ్ల నాటి భారీ వృక్షంను నేలమట్టం చేశారు.
అలాగే బస్టాండ్ సమీపంలోని చెట్లను అభివృద్ధి పనుల పేరుతో నరికివేశారు. ఈ చర్యలపై స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ సంఘటన మరువకముందే తాజాగా రెండు రోజుల క్రితం గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద గల యేళ్ల నాటి భారీ వృక్షాలను సరికివేయడం వివాదాస్పదంగా మారింది. అధికారుల తీరుపై సామాజిక మాధ్యమం వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సిన అధికారులే ఇలా చెట్లను నరకడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
సామాన్యులు చెట్లను నరికితే కేసులు, జరిమానాలు విధించే నగర పాలక అధికారులకు ఇవి కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి హుంకరిస్తే అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందేనా అని విమర్శిస్తున్నారు. ఇప్పటికే చుట్టూ పరిశ్రమల ప్రభావంతో కాలుష్యపు కబంధపు హస్తంలో చిక్కుకున్న రామగుండంలో పర్యావరణంను పెంపొందించాల్సింది పోయి భారీ వృక్షాలను నరుక్కుంటూ పోతే గాలి నాణ్యత, ఉష్ణోగ్రతలు, నీడ, పచ్చదనంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందనీ, వేసవిలో ప్రకృతి ప్రయోజనాలు కోల్పోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఒకవైపు కూల్చివేతలు జరుగుతుండగా.. మరోవైపు ప్రకృతి విధ్వంసం కు పాల్పడడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల నరికివేతకు పాల్పడిన బాధ్యులపై పర్యావరణ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

