Siricilla | మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు.
Siricilla | గాంధీ చౌక్ : మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువారం తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు. 2018 మే 6న వేములవాడ పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి, ఓ మైనర్ నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ నేరానికి వేములవాడ అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎదురుగట్ల అజయ్ (A2) సహకరించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ దర్యాప్తు చేపట్టి నిందితుడు అజయ్ ను రిమాండ్‌కు పంపించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా కోర్టులో 18 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి అజయ్‌పై నేరం రుజువైందని తేల్చి శిక్ష విధించారు. కాగా, మరో నిందితుడు మైనర్ కావడంతో అతడిపై కేసు జువెనైల్ కోర్టులో విచారణ జరుగుతోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- accused
- judgement
- Minor girl
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

