ACB Raids | కొడిమ్యాల ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ACB Raids | జగిత్యాల టౌన్, జూన్, 04 : రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) మొయినొద్దీన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.
ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో కొడిమ్యాల ఫారెస్ట్ శాఖలో కలకలం రేగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

