Aadhar Update | ఆధార్ నవీకరణ గడువు పొడిగింపు.. సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించిన యూఐడీఏఐ
పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గడువు పొడిగించింది. ఈమేరకు సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేయగా, గడువు ముగిసినా అప్డేట్ చేసుకోని వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Aadhar Update | పదేళ్లు దాటిన ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గడువు పొడిగించింది. ఈమేరకు సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేయగా, గడువు ముగిసినా అప్డేట్ చేసుకోని వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. దశాబ్దానికోసారి ఆధార్ అప్డేట్ చేసుకోవడం మస్ట్ కాగా, ఈ ఏడాది మార్చి 15 నుంచి మొదటిసారిగా అవకాశం కల్పించింది. నాలుగు నెలల పాటు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొనగా, జిల్లాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు ఆధార్ కేంద్రాల ఎదుట క్యూలైన్లు కట్టారు. అయినా, పూర్తి కాకపోవడంతో అనేక మంది మిగిలిపోయారు. యూఐడీఏఐ ఇచ్చిన నాలుగు నెలల గడువు ఈనెల 14తో ముగియడంతో, ఆధార్ నవీకరణ చేసుకోని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14 వరకు గడువు పొడిగిస్తూ భారత విశిష్ట ప్రాధికార సంస్థ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ గడువు ముగిసిన అనంతరం విధిగా డబ్బులు చెల్లించి, నవీకరించుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో, అత్యవసరంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు జిల్లా వాసులు తొందరపడుతున్నారు. ఆధార్ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే, యూఐడీఏఐ నిబంధనల మేరకు ‘మై ఆధార్ ’ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లలో కూడా నవీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫొటోను కూడా అప్లోడ్ చేసుకునే వీలు కల్పించింది.
ఆధార్ అప్డేట్ చేసుకునే విధానం
వెబ్సైట్ https:// myaadhaar .uidai. gov.in లో ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రొసీడ్ టూ అప్డేట్ అడ్రస్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన అనంతరం వచ్చే డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయాలి. అప్పటికే అందులో పొందుపర్చిన వివరాలన్నీ తెరపైకి వస్తాయి. వీటిలో సవరణ ఉంటే చేసుకోవాలని, లేకుంటే ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ జాబితా నుంచి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లు ఎంచుకుని, వాటి స్కాన్ కాపీలు అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ స్క్రీన్‌పై వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే వీలు కలుగుతుంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

