Dog Attack | కుక్క దాడిలో రేకొండ సర్పంచ్‌తో పాటు ఎనిమిది మందికి గాయాలు
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో కుక్క స్వైరవిహారం చేయడంతో సర్పంచ్‌తో పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే గ్రామంలో పలువురిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది.
Dog Attack | చిగురుమామిడి, నవంబర్ 9 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో కుక్క స్వైరవిహారం చేయడంతో సర్పంచ్‌తో పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే గ్రామంలో పలువురిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. స్థానికుల కథనం ప్రకారం.. రేకొండ గ్రామంలో పలువురిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో వారు సర్పంచ్ అల్లెపు సంపత్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ కుక్క సర్పంచ్‌పై కూడా దాడి చేసి గాయపరిచింది.
గాయపడిన వారిలో సర్పంచ్ అల్లెపు సంపత్తో పాటు దుడ్డేల రాజమ్మ, దుడ్డేల బూదమ్మ, మోర లచ్చవ్వ, మోర మధు, గందె సహర్ష్ తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా గ్రామస్తుల సమాచారంతో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడదపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

