Volodymyr Zelensky | పుతిన్‌కు నేనంటే భయం.. ఈ విషయం ట్రంప్‌తో చెప్పా : జెలెన్స్కీ
Volodymyr Zelensky | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తానంటే భయమని, ఇదే విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెప్పానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. పుతిన్ తనకు, అమెరికాకు మాత్రమే భయపడతాడని జెలెన్స్కీ పేర్కొన్నాడు.
Volodymyr Zelensky : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తానంటే భయమని, ఇదే విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెప్పానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. పుతిన్ తనకు, అమెరికాకు మాత్రమే భయపడతాడని జెలెన్స్కీ పేర్కొన్నాడు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో సమావేశమైన విషయాన్ని జెలెన్స్కీ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే బలమైన సంకల్పంతో ఉన్నారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధానికి ముగింపు ఎలా పలుకాలనే విషయంపై తామంతా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పారిస్‌లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించామని వెల్లడించారు. పుతిన్ తనకు, అమెరికాకు మాత్రమే భయపడుతాడని అన్నారు.
త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసిన మేక్రాన్‌కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్లుగా రష్యాతో సాగుతున్న యుద్ధం కోసం బైడెన్ సర్కారు తమకు ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తోందని చెప్పారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ఇప్పటివరకు 62 బిలియన్ డాలర్ల ఆయుధాలు అందాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

