ఇతన్ని తీసుకెళ్లి.. మా వాళ్లనివ్వండి: జెలెన్స్కీ
కీవ్: రష్యా వ్యాపార, రాజకీయవేత్త విక్టర్ మెద్వెచక్ను ఉక్రెయిన్ అరెస్టు చేసింది. ఉక్రెయిన్ మిలిటరీ దుస్తులు ధరించి.. చేతులకు బేడీలతో ఉన్న మెద్వెచక్ ఫోటోను రిలీజ్ చేశారు. అయితే మెద్వెచక్ను తీసుకుని, బంధీ అయిన తమ పౌరుల్ని విడుదల చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. వాస్తవానికి కొన్నాళ్ల పాటు కీవ్‌లో మెద్వెచక్ గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే రష్యా ఆక్రమణ తర్వాత ఆయన అదృశ్యమయ్యారు. 67 ఏళ్ల మెద్వెచక్ను మళ్లీ ఉక్రెయిన్ పోలీసులు పట్టుకున్నారు. మెద్వెచక్ను తీసుకువెళ్లి తమ ఆధీనంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలను రిలీజ్ చేయాలని పుతిన్‌ను జెలెన్స్కీని కోరారు. మెద్వెచక్ సంపన్న వ్యాపారవేత్త. పుతిన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే రష్యా అధ్యక్ష భవనంతో లింకులు అవసరమన్న నేపథ్యంలో మెద్వెచక్తో ఇన్నాళ్లూ ఉక్రెయిన్ సత్ సంబంధాలను కొనసాగించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- exchange
- Medvedchuk
- Putin
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

