YouTube Monetization Rules | కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త చెప్పిన యూట్యూబ్.. మానిటైజేషన్ నిబంధనల్లో కీలక మార్పులు
YouTube Monetization Rules | వీడియో స్ట్రీమింగ్కు సంబంధించిన ప్రముఖ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube).. కంటెంట్ క్రియేటర్లకు (Content creators) శుభవార్త చెప్పింది. మానిటైజేషన్ నిబంధనల్లో (YouTube monetization rules) కీలక మార్పులు చేసింది.
హైదరాబాద్: వీడియో స్ట్రీమింగ్కు సంబంధించిన ప్రముఖ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube).. కంటెంట్ క్రియేటర్లకు (Content creators) శుభవార్త చెప్పింది. మానిటైజేషన్ నిబంధనల్లో (YouTube monetization rules) కీలక మార్పులు చేసింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు కావాల్సిన సబ్స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను సవరించింది. అంటే.. ఇక నుంచి తక్కువ సబ్స్క్రైబర్స్ బేస్ కలిగిన కంటెంట్ క్రియేటర్స్ సైతం యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు.
పాత నిబంధనల ప్రకారం.. యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు అర్హత సాధించాలంటే కనీసం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అదేవిధంగా ఏడాదిలో కనీసం 4000 గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కావాలి. మారిన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో 3000 గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కావాలి.
అయితే, కొత్త మానిటైజేషన్ నిబంధనలను యూట్యూబ్ తొలుత అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియా దేశాల్లో అమలు చేస్తోంది. త్వరలోనే మిగిలిన దేశాల్లో అమలు చేయనుంది. అయితే, భారత్‌లో యూట్యూబ్ నూతన నిబంధనలను ఎప్పటి నుంచి అమలు చేసేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా కొత్త రూల్స్ వల్ల చిన్న క్రియేటర్లు సైతం ఇకపై యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించే వీలు కలుగనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

