Xi Jinping: చైనా అధ్యక్షుడిగా మూడవ సారి ఎన్నికైన జీ జిన్‌పింగ్
XiJinping: మరో అయిదేళ్ల పాటు చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ కొనసాగనున్నారు. ఇవాళ జరిగిన పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన్ను మూడవసారి దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2,952 ఓట్లు ఆయనకు అనుకూలంగా పోలయ్యాయి.
బీజింగ్: చైనా(China) అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్(Xi Jinping) మూడవసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమీషన్(CMC) చైర్మెన్‌గా కూడా ఆయన ఎన్నికయ్యారు. బీజింగ్‌లో జరుగుతున్న 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఇవాళ ఆయన్ను ఏకగ్రీవంగా(Unanimously) దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక చైనా ఉపాధ్యక్షుడిగా హాన్ జంగ్ ఎన్నికయ్యారు.
Xi Jinping, newly elected president of the People's Republic of China (PRC) and chairman of the Central Military Commission of the PRC, made a public pledge of allegiance to the Constitution at the Great Hall of the People in Beijing on Friday. #TwoSessions pic.twitter.com/aVawVIVJPA
— Global Times (@globaltimesnews) March 10, 2023
మూడవ సారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ .. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్(Great Hall of People)లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం(Constitution) మీద ప్రమాణం చేశారు.
69 ఏళ్ల జీ జిన్‌పింగ్ మరో అయిదేళ్ల పాటు దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(China Communist Party) నేతగా నియమితులైన విషయం తెలిసిందే.ఇవాళ జరిగిన సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌కు పోలయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

