మాతో పెట్టుకుంటే తలలు పగులుతయ్ : చైనా వార్నింగ్

బీజింగ్ : డ్రాగన్ దేశంలో కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విదేశీ శక్తులు తమను బెదిరించే ప్రయత్నం చేసినా లేక అనుచితంగా ప్రవర్తించినా.. వారి తలలు పగులుతాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపులకు భయపడే రోజులు పోయాయన్నారు. తయిమిన్ స్క్వేర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పవిత్ర సందేశాలు పనిచేయవన్నారు. అమెరికాను టార్గెట్ చేస్తున్న రీతిలో చైనా అధ్యక్షుడు కఠినంగా ప్రసంగించారు. చైనా పట్టుదలను ఎవరూ తక్కువగా అంచనా వేయరాదు అని, దేశ సార్వభౌమత్వాన్ని, జాతి సమగ్రతను కాపాడుకునేందుకు చైనా ప్రజలు వెనుకడుగు వేయరన్నారు. తైవాన్ ఏకీకరణ విషయంలో తమల్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబరాల నేపథ్యంలో బీజింగ్ కళకళలాడింది. మిలిటరీ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించారు. శతఘ్నలను పేలుస్తూ సెట్యూల్ నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. తయిమిన్ స్క్వేర్లో జరిగిన వేడుకలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మాస్క్లు లేకుండానే జనం కనిపించారు. దాదాపు గంట సేపు జీ జిన్పింగ్ ప్రసంగించారు. దేశాన్ని ఆధునీకరించడంలో తమ పార్టీ సాధించిన ఘనతను ఆయన వెల్లడించారు. దేశాభివృద్ధిలో పార్టీ కీలకంగా నిలిచిందన్నారు.

కేవలం సోషలిజం మాత్రమే చైనాను రక్షిస్తుందని, సోషలిజం మాత్రమే చైనాను అభివృద్ధిపథంలో నడిపిస్తుందని ఆయన అన్నారు. చైనాపై బెదిరింపులను సాగనివ్వమని, తమపై ఎవరు వత్తిళ్లు తెచ్చినా.. వారికి సమాధానం చెబుతామని జీ జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తే వారి తలలు రక్తం చిందేలా చేస్తామన్నారు. 140 కోట్ల మంది ప్రజల శక్తితో తయారైన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్తో తుక్కుతుక్కు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రజలను మెచ్చుకున్న జిన్పింగ్.. వాళ్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు చెప్పారు. కానీ కమ్యూనిస్టు పార్టీ లేకుండా ఆ ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యం అయ్యేది కాదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

