Worlds Tallest Dog | ప్రపంచంలోనే అత్యంత పొడవైన కుక్క (Worlds Tallest Dog)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) లో చోటు దక్కించుకున్న గ్రేట్ డేన్ కుక్క జ్యూస్ (Zeus) తాజాగా మరణించింది. ప్రస్తుతం దాని వయసు 3 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఎముకల సంబంధిత క్యాన్సర్ (Bone Cancer) తో బాధపడుతున్న జ్యూస్ ఆరోగ్యం క్షీణించి చివరికి ప్రాణాలు కోల్పోయింది. అయితే, క్యాన్సర్ చికిత్సలో భాగంగా జ్యూస్ కుడికాలిని తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు జ్యూస్‌కు న్యుమోనియా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి సెప్టెంబర్ 12వ తేదీన తెల్లవారుజామున చనిపోయినట్లు దాని యజమాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘అత్యంత ఎత్తైన మగ కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న మా ప్రియమైన జ్యూస్ మరణించినందుకు మేము చాలా బాధపడ్డాము. జ్యూస్ న్యుమోనియాతో మంగళవారం ఉదయం మరణించాడు’ అని యజమాని బ్రిటనీ డేవిస్ వెల్లడించారు. ఆ వ్యాధితో జ్యూస్ ఎంతో ధైర్యంగా పోరాడిందని.. కానీ చివరికి విధి వక్రీకరించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గ్రేట్ డేన్ 1.046 మీటర్ల (3 అడుగుల 5.18 అంగుళాలు) పొడవు ఉండేది.
Also Read..
Anantnag Encounter | అనంత్‌నాగ్‌లో 50 గంటలుగా కొనసాగుతున్న యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్
Manipur Violence | 175 మంది మృతి.. మార్చురీలో 96 మృతదేహాలు.. మణిపూర్ హింసపై పోలీసు డేటా