World Population | రేపటికి ప్రపంచ జనాభా 809 కోట్లు!.. 2004లో పాపులేషన్ ఎంత పెరిగిందంటే?
ఈ ఏడాదిలో(2024) ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగి కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023తో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గి 0.9 శాతంగా నమోదైంది.
- 2024లో 7.1 కోట్లు పెరిగిన ప్రపంచ జనాభా
- న్యూ ఇయర్ నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లు
- అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అంచనా
World Population | న్యూయార్క్, డిసెంబర్ 30: ఈ ఏడాదిలో(2024) ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగి కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023తో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గి 0.9 శాతంగా నమోదైంది. 2025 జనవరిలో ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతాయని నివేదిక అంచనా వేసింది.
2024లో అమెరికా జనాభా 26 లక్షలు పెరుగింది. కొత్త సంవత్సరం నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లకు చేరుతుందని సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. 2025 జనవరిలో అమెరికాలో ప్రతి 9 సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందని అంచనా. ప్రతి 23.2 సెకండ్లకు అమెరికా జనాభాకు ఒక అంతర్జాతీయ వలస జత అవుతుందని నివేదిక తెలిపింది.
జననాలు, మరణాలు, అంతర్జాతీయ వలసలు అన్నీ కలిపి అమెరికా జనాభాలో ప్రతి 21.2 సెకండ్లకు ఒక వ్యక్తి పెరుగుదల ఉంటుందని పేర్కొన్నది. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షలు పెరిగింది. పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అమెరికా జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 1930 దశకం తర్వాత ఇదే అత్యంత తక్కువ శాతం పెరుగుదల.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

