World Bank | శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించే ఆలోచనేమీ లేదు..!
World Bank | ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ప్రస్తుతానికి ఆర్థిక సహాయం అందించే ఆలోచన ఏమీ లేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. లంకలో తగిన స్థూల ఆర్థిక విధానానికి సంబంధించి ఫ్రేమ్వర్క్ ఏర్పడే వరకు సాధ్యం కాదని తెలిపింది. శ్రీలంకకు నిర్మాణాత్మకమైన సంస్కరణలు అవసరమని వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో కొనసాగుతున్న సంస్కరణలు ఆర్థిక స్థిరీకరణపై దృష్టి పెట్టాలని సూచించింది. లంకలో ప్రస్తుత పరిస్థితి కారణాలు గుర్తించి.. తొలగించాల్సిన అవసరం ఉందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శ్రీలంక సరళమైన, సమ్మిళిత పద్ధతిలో అభివృద్ధి చెందే విధానాన్ని అవలంభించాలని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, భయంకరమైన ఆర్థిక పరిస్థితి ప్రజలపై చూపుతున్న ప్రభావంపై ఆందోళన చెందుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. పేద కుటుంబాలకు అవసరమైన మందులు, వంటగ్యాస్, ఎరువులు, పాఠశాల విద్యార్థులకు ఆహారం, ఆర్థిక సహాయం తదితర అవసరమైన వస్తువులను నిర్ధారించేందుకు శ్రీలంకకు ఇప్పటికే జారీ చేసిన రుణ సౌకర్యాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. శ్రీలంకలో నిత్యావసరాల లభ్యతను నిర్ధారించేందుకు ఇప్పుడు 160 మిలియన్ల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రపంచ బ్యాంక్ చెప్పింది. శ్రీలంకలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఇతర మిత్రదేశాల సమన్వయంతో లంక ప్రజలు గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రపంచ బ్యాంక్ తరఫున ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

