TRUMP| దోషిగా తేలినా.. అధ్యక్ష బరి నుంచి తప్పుకోను: ట్రంప్
వాషింగ్టన్: తనపై నమోదు చేసిన అభియోగాలు రుజువై, శిక్షపడినా అధ్యక్ష బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు.
TRUMP| వాషింగ్టన్: తనపై నమోదు చేసిన అభియోగాలు రుజువై, శిక్షపడినా అధ్యక్ష బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ప్రాసిక్యూటర్లు కోరిన సెక్యూరిటీ టేపులను సమర్పించడంలో తాను ఎలాంటి తప్పుచేయలేదని పేర్కొన్నారు. రహస్య పత్రాలకు సంబంధించిన కేసులో ప్రాసిక్యూటర్లు తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలు నమోదు చేశారు. సెక్యూరిటీ ఫుటేజీని డిలీట్ చేయాలని ఫ్లోరిడాలోని తన రిసార్టు ఉద్యోగులను ట్రంప్ ఆదేశించినట్టు అందులో ఆరోపించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘ఈ సెక్యూరిటీ టేపులు సమర్పించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ వాటిని అందజేశాం’ అని ఆయన పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పేలా ఉద్యోగులను బెదిరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
రిపబ్లికన్ పార్టీ నేత అయిన డొనాల్డ్ ట్రంప్ 2017-21 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో రెండో పర్యాయం అధ్యక్ష పదవికి పోటీచేసినా.. డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2024లో జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

