టికెట్ చేజారినా వరించిన అదృష్టం : మహిళకు రూ 7 కోట్ల జాక్ పాట్

న్యూయార్క్ : ఒన్ మిలియన్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసి బంపర్ ప్రైజ్ తనకు రాలేదనే నిరాశతో టికెట్ ను అక్కడే పడవేసి వెళ్లిన మహిళకు రూ 7 కోట్ల జాక్ పాట్ తగిలింది. అమెరికాలోని మసాచుసెట్స్ కు చెందిన మహిళ లీ రోజ్ ఫిగా స్థానిక స్టోర్ లో ఒన్ మిలియన్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేసింది. ఆపై తనకు ప్రైజ్ రాలేదనే అనుమానంతో దాన్ని అక్కడే పడేసి వెళ్లిపోయింది. తాను హడావిడిగా లంచ్ చేస్తూ టికెట్ ను స్క్రాచ్ చేశానని ఆ నెంబర్ కు లాటరీ రాలేదని అక్కడే విసిరేసి వెళ్లానని లీ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ వెనుక టికెట్ ను స్టోర్ యజమాని కుమారుడు అభి షా గుర్తించాడు.
పది రోజుల పాటు ఆ టికెట్ అక్కడే ఉందని ఓ సాయంత్రం దాన్ని పరిశీలించగా అసలు సదరు మహిళ స్క్రాచ్ చేయలేదని తెలిసింది. తాను నెంబర్ ను స్క్రాచ్ చేయగా రూ 7 కోట్ల లాటరీ ఆ నెంబర్ కే వచ్చినట్టు వెల్లడైందని స్థానిక టీవీ చానెల్ కు అభి షా తెలిపారు. ఇక లీని వెతుక్కుంటూ ఆమె ఆఫీస్ కు వెళ్లి ఆమె తల్లితండ్రులు స్టోర్ వద్ద వేచిచూస్తున్నారని షా చెప్పాడు. అక్కడకు వచ్చిన మహిళ రూ 7 కోట్ల ప్రైజ్ తనకు వచ్చినట్టు తెలుసుకుని తల్లితండ్రులతో సంతోషం పంచుకున్నారు. స్టోర్ యజమానికి లాటరీ కమిషన్ వస్తుందని తెలిసినా వారి నిజాయితీకి మెచ్చి షా కుటుంబానికి అదనపు బోనస్ ఇచ్చేందుకు లీ సిద్ధమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

