ఇదేందయ్యా ఇది.. నాలుగు మీద వెంట్రుకలు మొలవడం ఏంటి అంటారా.. మీరు చదివింది నిజమే. ఆ మహిళ నాలుక మీద వెంట్రుకలు ఉన్నాయి. కానీ.. నాలుక మీద వెంట్రుకలు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. అలా నాలుక మీద వెంట్రుకలు రావడం వెనుక పెద్ద కారణమే ఉంది. తనకు చాలా అరుదైన క్యాన్సర్ రావడమే.
స్క్వామస్ సెల్ కార్సినోమా అనే అరుదైన క్యాన్సర్ ఆ మహిళకు సోకింది. అది నాలుకకు వచ్చే క్యాన్సర్ అన్నమాట. దీంతో తన నాలుకకు డాక్టర్లు సర్జరీ చేశారు. క్యాన్సర్ వల్ల ఇన్ఫెక్షన్ సోకిన నాలుక కొంత భాగాన్ని తన తొడ నుంచి తీసి రీప్లేస్ చేశారు. దీంతో తన నాలుక మీద వెంట్రుకలు మొలవడం స్టార్ట్ అయింది.
తను క్యాన్సర్‌ను జయించినా.. తన నాలుక మీద వెంట్రుకలు పెరగడం అనేది తనకు చాలా ఇబ్బందిని కలిగించింది. తన తొడ నుంచి తీసి కణజాలాన్ని నాలుక దగ్గర రీప్లేస్ చేయడం వల్లే వెంట్రుకలు పెరిగాయలని డాక్టర్లు తెలుసుకొని వెంట్రుకలు పెరగకుండా ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతానికి తను క్యాన్సర్, విచిత్రంగా పెరిగే వెంట్రుకల బారి నుంచి తప్పించుకుంది.