Silicon Valley Bank: ఎస్వీబీ మూసివేతకు ముందు రోజు.. 42 బిలియన్ల డాలర్ల విత్‌డ్రా !
Silicon Valley Bank: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేశారు. అయితే మూసివేతకు ముందు రోజు ఆ బ్యాంక్ నుంచి 42 బిలియన్ల డాలర్లు విత్‌డ్రా చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.
న్యూయార్క్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(Silicon Valley Bank)ను మూసివేశారు. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) ఈ విషయాన్ని ప్రకటించింది. గడిచిన 15 ఏళ్లలో ఆ దేశంలో ఆ ఆర్థిక సంస్థ కుప్పకూలడం ఇదే మొదటిసారి. అమెరికాలో ఇన్నాళ్లూ ఎస్వీబీ బ్యాంక్ 16వ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగింది. కానీ శుక్రవారంతో ఆ బ్యాంక్ మనుగడ ముగిసింది. బ్యాంక్ దివాళా తీస్తున్న వార్తలు వ్యాపించడంతో.. భారీ సంఖ్యలో డిపాజిటర్లు(depositors) తమ డబ్బు విత్‌డ్రా కోసం ఎగబడ్డారు.
గ్రేట్ రిసెషన్(great recession) తర్వాత మూతపడ్డ అతిపెద్ద రెండవ బ్యాంక్‌గా ఎస్వీబీ నిలిచింది. 2008లో వాషింగ్టన్ మ్యూచువల్(washington mutual) బ్యాంక్ మూతపడిన విషయం తెలిసిందే. 300 బిలియన్ల డాలర్ల నిలువ ఉన్న సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ బ్యాంక్‌ను మూసివేశారు.
బ్యాంక్‌ను మూసివేయనున్నట్లు వార్తలు రావడంతో.. గురువారం భారీ సంఖ్యలో ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు తమ సొమ్మును తీసుకునే(withdraw) ప్రయత్నం చేశారు. గురువారం రోజున దాదాపు 42 బిలియన్ల డాలర్ల డబ్బును డిపాజిటర్లు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

