Winter Olympics 2022 | చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా
US boycott Beijing Olympics | చైనాలోని బీజింగ్‌లో వచ్చే ఏడాదిలో జరిగే వింటర్ ఒలిపింక్స్ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరించింది. ఈ విషయాన్ని

వాషింగ్టన్ : చైనాలోని బీజింగ్‌లో వచ్చే ఏడాదిలో జరిగే వింటర్ ఒలిపింక్స్ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ప్రకటించారు. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలిపింక్స్, పారాలింపిక్ క్రీడలకు బైడెన్ పరిపాలన అధికారిక, దౌత్య ప్రతినిధులను ఎవరినీ పంపదని ప్రకటించారు. జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలే కారణమని స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ జరుగాల్సి ఉన్నాయి.
అయితే, క్రీడల్లో అమెరికా ఆటగాళ్లు పాల్గొనున్నారు. కేవలం దౌత్య ప్రతినిధులను మాత్రమే అమెరికా బీజింగ్‌కు పంపదు. అమెరికా అథ్లెట్లకు పూర్తి మద్దతు ఉంటుందని, తామంతా వారితోనే ఉన్నామని వైట్‌హౌస్ సెక్రెటరీ పేర్కొన్నారు. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడంపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జావో లిజియాన్ అమెరికా తీరుపై విమర్శలు గుప్పించారు. ఇంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అధికారంలో ఉన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో 1980లో చివరిసారిగా అమెరికా మాస్కో ఒలింపిక్స్‌ను పూర్తిగా బహిష్కరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

