William Lai | తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)కి చెందిన విలియం లై షింగ్-తే ఘన విజయం సాధించారు. అయితే, విలియంకు ఓటేయొద్దని చైనా తైవాన్ పౌరులను హెచ్చరించింది. అయినా.. ఆ దేశ పౌరులు వినకుండా ఓట్లు వేసి గెలిపించారు. పక్కలో బల్లెంగా ఉన్న చైనా ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ విలియంకే ప్రజలు బహిరంగంగా మద్దతు తెలిపారు.
ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం విజయంకు 40.2శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు 98శాతం పూర్తయ్యిందని అల్ జజీరా పేర్కొంది. ఎన్నికల్లో విజయం సాధించిన విలియంకు ప్రత్యర్థి హౌ యు-ఇహ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి హౌ యు ఇహ్కు 33.4 శాతం ఓట్లు పోలయ్యాయి. అధికారం నుంచి తొలగించడంలో విఫలమైనందుకు హౌ తన మద్దతుదారులకు క్షమాపణలు చెప్పారు. విలియం లైని ‘ప్రమాదకరమైన వేర్పాటువాది’గా చైనా అభివర్ణించింది.
చర్చల కోసం విలియం లాయ్ చేసిన విజ్ఞప్తికి చైనా స్పందించలేదు. అయినా ఆయన విలియం శాంతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. చైనా బెలూన్లు జలసంధిని దాటుతున్నట్లు కనిపించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాతో షరతులతో కూడిన ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విలియం స్పష్టం చేశారు. తైవాన్ పార్లమెంట్లో 113 సీట్లు ఉన్నారు.