Israel-Hamas war | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి 100 రోజులు పూర్తి.. బందీల్లో చాలామంది చనిపోయి ఉండొచ్చన్న పాలస్తీనియన్ గ్రూప్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కొనసాగుతూనే ఉన్నది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై 100 రోజులు ముగిశాయి. ఈ సందర్భంగా పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ 37 సెకన్ల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేసింది.
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) కొనసాగుతూనే ఉన్నది. ఇరుపక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై 100 రోజులు ముగిశాయి. ఈ సందర్భంగా పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ 37 సెకన్ల నిడివితో ఉన్న ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తమ అధీనంలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలతో మాట్లాడించింది. వెంటనే తమని విడిపించాలని.. హమాస్‌పై సైనిక చర్యలను నిలిపివేయాలని వారు కోరుతున్నట్లు వీడియోలో ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి. వారి భవితవ్యాన్ని త్వరలో వెల్లడిస్తామని హమాస్ తెలిపినట్లు పేర్కొన్నాయి.
తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలామంది గాజాలో చనిపోయి ఉండొచ్చని హమాస్ అధికార ప్రతినిధి అబు ఒబేదా విడుదల చేసిన మరో సందేశంలో వెల్లడించారు. దీనికి ఇజ్రాయెల్ (Israel) పూర్తి బాధ్యతవహించాలన్నాడు. వారి సైనిక చర్యల వల్లే ఇదంతా జరిగిందని తెలిపాడు. ఇప్పటికీ సొరంగాల్లో ఉన్న బందీలకు ముప్పు పొంచి ఉందన్నాడు. ఇజ్రాయెల్ దాడులు విస్తరించే కొద్దీ వారు మరింత ప్రమాదంలోకి జారుకుంటారని హెచ్చరించాడు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై రాకెట్లతో విరుకుపడిన హమాస్.. మొత్తం 240 మందిని బందీలుగా తీసుకున్నది. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంలో భాగంగా నవంబర్‌లో కొంతమందిని వదిలేసింది. ఇంకా 132 మంది హమాస్ వద్ద బందీలుగానే ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. మరో 25 మంది కాల్పుల్లో మరణించారని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

