‘ప్రవర్తన’ ఆధారంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తాం: రష్యా

కాబూల్: ప్రవర్తన ఆధారంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తామని రష్యా తెలిపింది. తాలిబన్ ప్రభుత్వ పని తీరును గమనించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియమించిన ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ ఈ మేరకు సోమవారం చెప్పారు. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడం లేదా గుర్తించకపోవడం అనే దానిపై రష్యా తొందరపడదు. తాలిబాన్ తిరుగుబాటుదారులు నాయకత్వం వహిస్తారని భావిస్తున్నాం’ అని అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, తాలిబన్లు బలవంతంగా ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని ఐరాసలోని మెజార్టీ సభ్య దేశాలు ఖండించాయి.
మరోవైపు తాలిబన్లు హింసకు పాల్పడవచ్చన భయాందోళనల నేపథ్యంలో ప్రజలు ఆ దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లోని రష్యా రాయబారి తాలిబన్ నాయకత్వంతో మంగళవారం సమావేశంకానున్నారు. ప్రధానంగా రష్యా రాయబార కార్యాలయం అధికారులు, సిబ్బంది భద్రతపై తాలిబన్లతో చర్చించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

