Nahid Islam: షేక్ హసీనాను గద్దె దింపిన విద్యార్థి నాయకుడు ఇతనే
Nahid Islam: విద్యార్థి ఉద్యమాన్నినడిపింది నహిద్ ఇస్లామ్. ఢాకా యూనివర్సిటీలో అతను సోసియాలజీ చదువుతున్నాడు. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చింది ఓ విద్యార్థి నాయకుడు. రాజీనామా చేసి ఆమె దేశం విడిచేలా చేసింది విద్యార్థి నాయకుడే. అతని పేరు నహిద్ ఇస్లామ్(Nahid Islam). 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా నహిద్ ఇస్లామ్ తీవ్ర పోరాటం చేశాడు. బంగ్లాదేశ్‌ను కుదిపేసిన ఆ ఉద్యమం నడిపింది నహిద్ ఇస్లామే. ఆ స్టూడెంట్ నేత .. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసింది.
నహిద్ ఇసల్ఆమ్ ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో సొసియాలజీ చదువుతున్నాడు. మానవ హక్కుల కార్యకర్తగా కూడా అతనికి గుర్తింపు ఉన్నది. విద్యార్థ ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్‌గా ఉన్నాడు. ఫ్రీడం ఫైటర్ల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం తీర్పును ఇవ్వడంతో నహిద్ ఇస్లామ్ ఉద్యమం చేపట్టాడు. ఆ కోటా వివక్షపూరితమైందన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా ఆ విధానం అమలు చేస్తున్నట్లు ఆరోపించాడు.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహిద్ ప్రచారం చేశాడు. విద్యార్థి నాయకులను ఉగ్రవాదులుగా పోల్చడంతో.. నహిద్ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశాడు. షాభాగ్లో నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ.. విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని, ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని హెచ్చరించాడు.
జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కండ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో అతన్ని అపహరించారు. నహిద్‌ను ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

