ఎవరీ నఫ్టాలీ బెన్నెట్.. ఇజ్రాయిల్ ప్రధానిగా ఎలా ఎన్నికయ్యారు ?

జెరుసలాం: నఫ్టాలీ బెన్నెట్.. ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. బెన్నెట్ ఎన్నికతో.. 12 ఏళ్లుగా ఇజ్రాయిల్‌ను పాలిస్తున్న బెంజిమన్ నెతాన్యూ అధికారానికి బ్రేక్ పడింది. నఫ్టాలీ బెన్నెట్ అతివాద మతతత్వ జాతీయవాది. మల్టీ మిలియనీర్. మాజీ టెక్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. మాజీ రక్షణ మంత్రి కూడా. ఆదివారం నెసెట్( పార్లమెంట్) సమావేశంలో 49 ఏళ్ల నఫ్టాలీ బెన్నెట్‌ను కొత్త ప్రధానిగా అంగీకరించారు. కూటమి ప్రభుత్వానికి 120 సభ్యులు ఉన్న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. యమీనా పార్టీకి చెందిన నఫ్టాలీ.. మరో సెంట్రిస్ట్ పార్టీ యాయిర్ లాపిడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాడు చేశారు. అతి స్వల్ప మెజారిటీ(60-59)తో నఫ్టాలీ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. యమీనా పార్టీ నేత నఫ్టాలీ.. ఇజ్రాయిల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపనున్నారు. మతతత్వ జీవిన విధానాన్ని కొనసాగించనున్న తొలి ప్రధానిగా ఆయన నిలవనున్నారు. యూదులు ధరించే కిప్పా టోపీని ఆయన ధరించనున్నారు.
అతివాద జాతీయవాది..
నఫ్టాలీ బెన్నట్ పేరెంట్స్ అమెరికాకు చెందినవారు. ఆయన అద్భుతంగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడగలరు. బెన్నెట్ మతపరంగా యూదుడు. హైటెక్ రంగంలో మిలియన్లు ఆర్జించారు. ఇజ్రాయిల్‌లోని హైఫా నగరంతో ఆయనకు అనుబంధం ఎక్కువ. సైనిక సేవలోనూ గడిపారు. సైరత్ మత్కల్ కమాండో యూనిట్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత హిబ్రూ వర్సిటీలో న్యాయ కోర్సులో చేశారు. 1999లో యాంటీ ఫ్రాడ్ సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కంపెనీని ఆయన అమెరికాకు అమ్మేశారు. 2006లో ఇజ్రాయిల్, హిజ్బుల్లాతో జరిగిన యుద్ధం ఆయన్ను రాజకీయాల వైపు ఆకర్షించింది. చాలా సూటిగా, సున్నితంగా తన భావాలను వ్యక్తం చేయగలరు. ఒకప్పుడు నెతాన్యూతోనే కలిసి బెన్నెట్ పనిచేశారు. కానీ ఆ తర్వాత బెంజిమెన్‌కు శత్రువుగా మారారు.
వెస్ట్ బ్యాంక్ శరణార్థుల మండలికి నఫ్టాలీ నేతగా ఉన్నారు. నెతాన్యూ ప్రభుత్వంలోనే విద్య, రక్షణ రంగాలకు మంత్రిగా చేశారు. మార్చిలో జరిగిన ఎన్నికల్లో నెతాన్యూకు బెన్నెట్ గట్టి పోటీ ఇచ్చారు. యాయిర్ లాపిడ్ పార్టీతో కలిసి నఫ్టాలీ కీలక ఎత్తులు వేశారు. నెతాన్యూ ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడంతో.. బెన్నెట్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లు ఆయన ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత యాయిర్ లాపిడ్ పార్టీకి మరో రెండేళ్లు ప్రధాని పదవిని అప్పగించనున్నారు. పాలస్తీనా స్వాతంత్ర్యాన్ని బెన్నెట్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇక నెతాన్యూ ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.
మోదీ విషెస్..
ఇజ్రాయిల్ నూతన ప్రధానిగా నఫ్టాలీ బెన్నెట్ ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు ప్రధాని మోదీ విషెస్ తెలిపారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలకు వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండనున్నాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

