MPox | ఆఫ్రికాలో ఎంపాక్స్ విజృంభణ.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO..!
MPox | ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ విస్తరిస్తున్నది. ఇందులో 96శాతానికిపైగా కేసులో కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు. మరో వైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్.. మరింత వ్యాప్తి చెందుతున్నది. దాంతో మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది.
MPox | ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ విస్తరిస్తున్నది. ఇందులో 96శాతానికిపైగా కేసులో కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు. మరో వైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్.. మరింత వ్యాప్తి చెందుతున్నది. దాంతో మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో ఎంపాక్స్ రోజురోజుకు విస్తరిస్తున్నది. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటువ్యాధి సోకుతున్నది. ఎంపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ప్రకటించింది.
ఆఫ్రికాఖండంలో ఈ వైరస్‌కు వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ వారంలో ప్రారంభంలో ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రకారం.. ఎంపాక్స్‌తో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సహాయం కోసం పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ వైరస్ ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపాక్స్‌పై అందరూ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లోనే విస్తరించే ప్రమాదం ఉందన్నారు. వివిద దేశాల్లో అనేక రకాలుగా ఎంపాక్స్ వ్యాప్తి చెందుతుందన్నారు. అయితే, ఈ ఏడాది 13 దేశాల్లో ఎంపాక్స్ వైరస్ సోకినట్లు ఆఫ్రికా సీడీసీ వెల్లడించింది. మొత్తం కేసులు, మరణాల్లో 96శాతానికిపైగా కాంగోలోనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కేసులు 160శాతం, మరణాలు 19శాతం ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు 14వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 524 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాంగోలో 70శాతం కేసులు 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనే ఉన్నాయని.. 85శాతం మరణాల్లో వారే ఉన్నారని ఆఫ్రికా సీడీసీ పేర్కొంది. దక్షిణాఫ్రికా అంటువ్యాధుల నిపుణుడు సలీం అబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ తాము ఆఫిక్రా చుట్టుపక్కల ఉన్న పొరుగుదేశాలకు సైతం ఎంపాక్స్ ముప్పు ఉందన్నారు. కాంగాలో వ్యాపిస్తున్న ఎంపాక్స్ కొత్త వేరియంట్‌తో మరనాలు రేటు దాదాపు 3-4శాతం ఉందని చెప్పారు. 2022లో ఎంపాక్స్ 70 కంటే ఎక్కువ దేశాలను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. కాంగో ఎంపాక్స్ రెస్పాన్స్ కమిటీ కోఆర్డినేటర్ క్రిస్ కాసిటా ఒసాకో మాట్లాడుతూ.. నాలుగు మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ కావాలని కాంగో అధికారులు కోరారని.. ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Read Also :
Gaza | దువ్వెనలు లేకపోతే ఆడపిల్లలు జుట్టు కత్తిరించుకోవాలి.. ఆడపిల్లలకు డాక్టర్ అడ్వైజ్..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

