Syrian Girl | తమ్ముడికి రక్షణ కవచంలా అక్క.. బ్రేవ్ గర్ల్ అంటూ డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ప్రశంస..!
ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద చిక్కుకుని కూడా.. తన తమ్ముడికి రక్షణ కవచంలా కాపాడే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ చిన్నారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు.
Syrian Girl | తుర్కియే, సిరియా దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. శిథిలాల కింద నుంచి బయటపడుతున్న మృతదేహాలతో ఆయా ప్రదేశాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ఆ ప్రదేశాల్లో కొన్ని దృశ్యాలైతే హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. ఇదే సమయంలో ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తోంది.
ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద చిక్కుకుని కూడా.. తన తమ్ముడికి రక్షణ కవచంలా కాపాడే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఆ అమ్మాయి తన తమ్ముడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం చూసిన వారంతా చిన్నారిని ప్రశంసిస్తున్నారు. ‘అద్భుతం జరిగింది. ఆమె చాలా గొప్ప అక్క. ధైర్యవంతురాలు’ అంటూ పలువురు నెటిజన్లు సైతం కొనియాడుతున్నారు. తాజాగా ఆ చిన్నారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘ఈ ధైర్యవంతురాలైన అమ్మాయికి అంతులేని ప్రశంసలు..’ అంటూ రాసుకొచ్చారు.
Endless admiration for this brave girl.pic.twitter.com/anliOTBsy1
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) February 8, 2023
కాగా, ‘శిథిలాల కింద 17 గంటల పాటు తమ్ముడి తలకు చేయి అడ్డుగా పెట్టి కాపాడిన 7 ఏళ్ల బాలిక సురక్షితంగా బయటపడింది. ఈ ఫొటోను ఎవరూ షేర్ చేయట్లేదు. ఒకవేళ మరణించి ఉంటే వైరల్ అయి ఉండేది. దయచేసి సానుకూల సందేశాలను కూడా షేర్ చేయండి’ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహమ్మద్ సఫా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

