White House: 38 రోజుల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. అమెరికాదే విజయమన్న వైట్‌హౌజ్
White House : 38 రోజుల పాటు సాగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా విజయం సాధించినట్లు అమెరికా శ్వేతసౌధం ప్రకటించింది. ఇరాన్‌తో రెండు వారాల కాల్పలు విరమణకు ట్రంప్ ఒప్పుకున్న నేపథ్యంలో ప్రెస్ సెక్రటరీ కరోలినా లివియేట్ స్పందించారు. 4 నుంచి 6 వారాల్లో ఆపరేషన్ ముగుస్తుందని ట్రంప్ అంచనా వేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
వాషింగ్టన్: అమెరికా శ్వేతసౌధం(White House ) కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 38 రోజుల పాటు సాగినట్లు చెప్పింది. అయితే ఆ 38 రోజుల్లో తమ మిలిటరీ లక్ష్యాలను అందుకున్నట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివియేట్ తెలిపారు. ఆమె తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా అనుకున్నదాని కన్నా ఎక్కువే సాధించినట్లు చెప్పారు. ఇది అమెరికా విక్టరీ అని, ఈ విజయం ట్రంప్‌కు దక్కుతుందని, అసాధారణ సైన్యం ఈ విజయాన్ని నిజం చేసిందన్నారు. ఇరాన్‌పై సమరం సుమారు నాలుగు నుంచి ఆరు వారాల పాటు జరుగుతుందని మొదటి నుంచీ ట్రంప్ పేర్కొన్న విషయాన్ని వైట్‌హౌజ్ సెక్రటరీ తన పోస్టులో గుర్తు చేశారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఆకస్మిక దాడి చేశాయి. అయితే ఆ ఆపరేషన్ కనీసం 4 నుంచి 6 వారాల్లో ముగుస్తుందని ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
అమెరికా మిలిటరీ సామర్థ్యం నమ్మశక్యం కానిదని, ఇక మిలిటరీ సంబరాలు చేసుకుంటున్నట్లు లివియేట్ పేర్కొన్నారు. మన యోధుల సామర్థ్యం అనిర్వచనీయమని, కేవలం 38 రోజుల్లోనే కీలకమైన మిలిటరీ లక్ష్యాలను అందుకున్నట్లు ఆమె చెప్పారు. రక్షణ శాఖ మంత్రి ఈపట్ హెగ్సెత్, త్రివిధ దళాల చీఫ్‌లతో పెంటగాన్ త్వరలో మీడియా బ్రీఫింగ్ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇన్నాళ్లూ బాంబు వర్షంతో ఇరాన్‌ను అతలాకుతలం చేసినా అమెరికా.. ఇప్పుడు దౌత్య మార్గంలో పరిష్కారాన్ని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో సమస్య పరిష్కారానికి దౌత్య మార్గం ఓపెన్‌గా ఉన్నట్లు తన పోస్టులో ప్రెస్ సెక్రటరీ తెలిపారు. మిలిటరీ సాధించిన విజయం వల్ల.. ఇరాన్‌తో దౌత్య చర్చలు చేపట్టేందుకు ట్రంప్‌కు అవకాశం వచ్చిందన్నారు. దీని వల్ల దీర్ఘకాలిక శాంతి వర్ధిల్లుతుందని ఆమె ఆశించారు. హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయబోతున్న అంశాన్ని కూడా లివియేట్ తన ట్వీట్లో రాశారు. ట్రంప్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దు అని, అమెరికా ప్రయోజనాలు, శాంతి కోసం ఆయన పోరాటం చేస్తున్నట్లు లివియేట్ తన పోస్టులో వెల్లడించారు.
This is a victory for the United States that President Trump and our incredible military made happen.
From the very beginning of Operation Epic Fury, President Trump estimated this would be a 4-6 week operation.
Thanks to the unbelievable capabilities of our warriors, we have…
— Karoline Leavitt (@PressSec) April 8, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

