శాన్ఫ్రాన్సిస్కో, జూన్ 3: వాట్సాప్‌లో మీరు ఒక్కసారి మెసేజ్ పంపిన తర్వాత.. ఏదైనా మార్పులు చేయాలనుకుంటే చేయగలరా..? చేయలేరు కాకపోతే దాన్ని ఎదుటి వ్యక్తి చూడకుండా డిలీట్ చేయొచ్చు.. అయితే మీరు పంపిన మెసేజ్‌లో మార్పులు (ఎడిట్) చేసుకునే వీలు కల్పించేందుకు కొత్త ఫీచర్ తీసుకొస్తున్నది వాట్సాప్. అయితే ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉన్నదని కంపెనీ వెల్లడించింది. మెసేజ్‌ను పంపిన తర్వాత ఎడిట్ చేస్తే.. పాత వెర్షన్ కనిపించకుండా కూడా చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.