Rishi Sunak on Liz Truss | లిజ్ ట్రస్‌కు అండగా నిలుద్దాం.. టోరీలకు రిషి సునాక్ పిలుపు
Rishi Sunak on Liz Truss | బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న లిజ్ ట్రస్‌కు అండగా నిలవాలని రిషి సునాక్ అన్నారు
Rishi Sunak on Liz Truss | బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు అండగా నిలవాలని ఆమె ప్రత్యర్థి రిషి సునాక్ పిలుపునిచ్చారు. బ్రిటిన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైనట్లు అధికార కన్జర్వేటివ్ పార్టీ సోమవారం ప్రకటించింది. ఎన్నికల ఫలితాలపై రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపించేందుకు లిజ్ ట్రస్‌కు అండగా నిలవాలని కోరారు. `నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కన్జర్వేటివ్ పార్టీ నేతలు అంతా ఒకే కుటుంబం అని చెబుతున్నా. కొత్త ప్రధాని లిజ్ ట్రస్.. విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని నడిపించనున్న నేపథ్యంలో మనమంతా ఏకమై ఆమె వెన్నంటి నిలవడం సరైన చర్య` అని రిషి సునాక్ ట్వీట్ చేశారు.
బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో లిజ్ ట్రస్ 81,326 ఓట్లు, రిషి సునాక్ 60,339 ఓట్లు పొందారు. దీంతో రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ సుమారు 21 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ హర్షం వ్యక్తం చేశారు. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానన్నారు. రెండేండ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

