COVID-19 variant | బ్రిటన్‌లో విస్తరిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ఆ వేరియంట్ పేరు, లక్షణాలు తెలుసా..?
COVID-19 variant | బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్ (Eris) లేదా EG. 5.1 అని ఈ కొవిడ్-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లండన్: బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్ (Eris) లేదా EG. 5.1 అని ఈ కొవిడ్-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు.
సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులే ఉన్నాయని, ఆ తర్వాత ఎరిస్ వేరియంట్ కొవిడ్ కేసులదే రెండో స్థానమని వారు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

