అతిపెద్ద గ్రహాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్
న్యూఢిల్లీ: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ భారీ గ్రహాన్ని కనుగొన్నది. సౌర వ్యవస్థ ఆవల ఉన్న ఆ గ్రహం బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉంది. సౌర వ్యవస్థ అవతల ఉన్న కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది. అయితే ఈ కొత్త గ్రహాన్ని నాలుగు రకాల లైట్ ఫిల్టర్లలో పరీక్షించారు. చాలా శక్తివంతంగా ఈ గ్రహం వెలిగిపోతోంది. సోలార్ సిస్టమ్ బయట ఎలా ఓ విశిష్ట ప్రదేశం ఉందో ఈ గ్రహాన్ని వీక్షిస్తే తెలుస్తుందన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న గ్రహాన్ని హెచ్ఐపీ 65426బీగా నామకరణం చేశారు. ఇది జూపిటర్ గ్రహం కన్నా సుమారు 12 రెట్లు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ గ్రహం ఏర్పడి దాదాపు 15 నుంచి 20 మిలియన్ల సంవత్సరాలు అయి ఉంటుందని అనుకుంటున్నారు. నాసా తన బ్లాగ్‌లో కొత్త ప్లానెట్కు సంబంధించిన చిత్రాలను రిలీజ్ చేసింది. వాస్తవానికి ఈ గ్రహాన్ని 2017లో తొలిసారి గుర్తించారు. కానీ దానికి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు వెబ్స్ టెలిస్కోప్‌తో ఆ ప్లానెట్కు చెందిన కొత్త వివరాలను సేకరించారు.
జేమ్స్ వెబ్ కెమెరాలో ఉన్న నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాకు ఈ కొత్త ప్లానెట్ చిక్కింది. అయితే అత్యంత దూరం నుంచి కూడా ఆ కెమెరా గ్రహాన్ని గుర్తించింది. మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రూమెంట్ కూడా కీలక వ్యవహరించింది. ఈ దశాబ్ధం చివరలో ప్రయోగించనున్న నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ఆ గ్రహానికి చెందిన మరిన్ని కరోనాగ్రాఫ్ వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు నాసా తెలిపింది. ఇటీవలే డబ్ల్యూఏఎస్పీ-39 బీ వద్ద భారీ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ ఉన్నట్లు జేమ్స్ టెలిస్కోప్ కనుగొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

