Donald Trump : అమెరికా (USA) వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ (White House) కరస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఘటనపై వైట్‌హౌస్‌లో ఆయన మాట్లాడారు. దుండగుడు అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పైకి దూసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కాల్పులు ఘటన వైట్‌హౌస్ బాల్రూమ్ ఆవశ్యకతను తెలియజేస్తోందని అన్నారు.
తమకు మునుపెన్నడూ లేనటువంటి అసాధారణమైన భద్రత కావాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. తనపై దాడి ఇది తొలిసారి మాత్రమే కాదని, గతంలో కూడా దాడులు జరిగాయని గుర్తుచేశారు. కాల్పుల కారణంగా రద్దయిన డిన్నర్మీట్ను మరో 30 రోజుల్లో రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. కాగా, గతంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌పై కూడా ఇదే హోటల్లో కాల్పులు జరిగాయి.