Jacinda Ardern | తల్లిగా ఉండటానికే పాలిటిక్స్‌కు గుడ్‌బై.. న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా
Jacinda Ardern | తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించడానికే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్ తేల్చిచెప్పారు.
Jacinda Ardern | మాతృత్వం కోసమే రాజకీయాల నుంచి వైదొలిగినట్లు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా అర్డర్న్ చెప్పారు. గత జనవరిలో ప్రధాని పదవికి జెసిండా ఆర్డర్న్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా న్యూజిలాండ్ పార్లమెంట్లో జరిగిన వీడ్కోలు సభలో జెసిండా ఆర్డర్న్ మాట్లాడుతూ.. మంచి తల్లిగా ఉండటానికి నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నా.. పాలిటిక్స్‌లో మహిళలు రాణించడానికి, నాయకత్వం వహించడానికి మాతృత్వం అడ్డు కాకూడదు. లేబర్ పార్టీ నేతగా ఎన్నికైనప్పుడు నా మాతృత్వాన్ని కోల్పోవాలనుకోలేదు. ప్రధానిగా ఎన్నికయ్యాక తల్లిని కాబోతున్నట్లు తెలిసి ఎంతగానో సంతోషించా. నేతలు కూడా మనుషులే. వారి శక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా సేవ చేస్తారు. వారి సొంత జీవితం కోసం టైం కేటాయించాలి. ఇప్పుడు నాకు ఆ టైం వచ్చింది` అని చెప్పారు.
`దేశానికి సారధ్యం వహించడం ఎంతో ఉన్నతమైంది. ప్రస్తుతం వాతావరణం మార్పు మన ముందు గల పెద్ద సంక్షోభం.. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పర్యావరణ పరిరక్షణపై పాలిటిక్స్ చేయొద్దు.. పర్యావరణాన్ని పాలిటిక్స్‌కు దూరంగా ఉంచండి` అని జెసిండా ఆర్డర్న్ చెప్పారు.
2017లో న్యూజిలాండ్‌కు జెసిండా ఆర్డర్న్ ప్రధానిగా ఎన్నిక అయ్యారు. 2018లో ఒక బిడ్డకు తల్లయ్యారు. ప్రధానిగా బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళా ప్రధానిగా జెసిండా నిలిచారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆమె సారధ్యంలోని లేబర్ పార్టీ, వ్యక్తిగతంగా జెసిండా ఆర్డర్న్ ఆదరణ కోల్పోవడం వల్లే రాజీనామా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో జెసిండా ఆర్డర్న్ స్పందించారు. తన రాజీనామాలో ఏ రాజకీయం లేదన్నారు. మంచి తల్లిగా ఉండటానికి పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

