Boris Johnson | నాపై క్షిపణి దాడి చేస్తానంటూ పుతిన్ బెదిరించాడు: బోరిస్ జాన్సన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణకు ముందు రోజు తనపై క్షిపణి ప్రయోగిస్తానని పుతిన్ హెచ్చరించినట్లు బోరిస్ తాజాగా వెల్లడించారు.
Boris Johnson | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణకు ముందు రోజు తనపై క్షిపణి ప్రయోగిస్తానని పుతిన్ హెచ్చరించినట్లు బోరిస్ తాజాగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనపైకి రాకెట్‌ను ప్రయోగించడానికి కేవలం ఒక్క నిమిషం చాలని పుతిన్ బెదిరించినట్లు వివరించారు. ‘బోరిస్.. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. కానీ క్షిపణితో దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు’ అని హెచ్చరించినట్లు చెప్పారు.
‘ఉక్రెయిన్‌పైకి సైన్యాన్ని పంపించడానికి ముందు రోజు పుతిన్ నాకు ఫోన్ చేశారు. తన శత్రువు (ఉక్రెయిన్)కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తే రాకెట్ దాడికి వెనుకాడనని పుతిన్ హెచ్చరించారు’ అని జాన్సన్ తెలిపారు. అయితే పుతిన్ వ్యాఖ్యలకు తాను బెదిరిపోలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మద్దతివ్వడానికే మొగ్గు చూపానని వెల్లడించారు. అలాగే ఉక్రెయిన్.. తక్షణమే నాటోలో చేరదని చెప్పడానికి తాను ఎంతో బాధపడ్డానన్నారు.
గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడికి దిగిన విషయం తెలిసిందే. అప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా బోరిస్ జాన్సన్ సహా పలు దేశాధినేతలు కీవ్ లో పర్యటించారు. నాటో సభ్య దేశాలలో బ్రిటన్ కీలకమైంది.. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ కీవ్ లో పర్యటించడంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరిస్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

