Yevgeny Pregozhin | యాక్సిడెంట్ కాదు.. విమానానికి బాంబు పెట్టి లేపేశారు.. ప్రిగోజిన్ మరణంపై సంచలన విషయాలు బయటకు!
Yevgeny Pregozhin | రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో చెప్పారు. అయితే ప్రిగోజిన్ చనిపోయింది ప్రమాదంలో కాదని.. ఆయన ప్రయాణిస్తున్న విమానానికి బాంబు పెట్టి హత్య చేశారని, ఇదంతా పుతిన్ ఆదేశాలతోనే జరిగిందని తాజాగా వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించింది.
Yevgeny Pregozhin | వాషింగ్టన్, డిసెంబర్ 22: రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించాడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో చెప్పారు. అయితే ప్రిగోజిన్ చనిపోయింది ప్రమాదంలో కాదని.. ఆయన ప్రయాణిస్తున్న విమానానికి బాంబు పెట్టి హత్య చేశారని, ఇదంతా పుతిన్ ఆదేశాలతోనే జరిగిందని తాజాగా వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించింది. ప్రిగోజిన్ మృతి చుట్టూ ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. పుతినే ప్రిగోజిన్‌ను చంపించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
దీనిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ రష్యా మాజీ నిఘా అధికారిని ఉటంకిస్తూ ఇచ్చిన కథనంలో పుతిన్‌కి రైట్ హ్యాండ్‌గా భావించే, దేశ భద్రతా కౌన్సిల్ కార్యదర్శి నికోలయ్ పత్రుషేవ్ పుతిన్ అనుమతితో ప్రిగోజిన్‌ను హత్య చేయించారని, ఆ ప్రతిపాదనకు పుతిన్ అనుమతి ఇచ్చారని పేర్కొన్నది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యంలో వాగ్నర్ గ్రూపు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తర్వాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్, రష్యా రక్షణ మంత్రికి విబేధాలు తలెత్తాయి.
ఫలితంగా వాగ్నర్ గ్రూపు ఈ ఏడాది జూన్‌లో రష్యాలో తిరుగుబాటుకు చేసిన యత్నం క్రెమ్లిన్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో వాగ్నర్ గ్రూపు రాజధాని మాస్కోకు చేపట్టిన ‘మార్చ్’ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ప్రిగోజిన్‌తో ఎప్పటికైనా ముప్పేనని నికోలయ్ పత్రుషేవ్ చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. రక్షణ మంత్రిపై బహిరంగ ఆరోపణలు, తిరుగుబాటు, అనుకొన్న దాని కంటే వాగ్నర్ గ్రూపు శక్తివంతం అయిన నేపథ్యంలో ప్రిగోజిన్‌ను హతమార్చాలని రష్యాలో పుతిన్ తర్వాత రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావించే నికోలయ్ అనుకొన్నారని, దీనికి పుతిన్ కూడా అభ్యంతరం చెప్పలేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నది.
విమానం రెక్క కింద బాంబు
విమాన పేలుడు ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించాడని పుతిన్ మృతి సమయంలో పేర్కొన్నారు. ప్రిగోజిన్ పలు తప్పులు చేశాడని పేర్కొంటూనే పుతిన్.. విమానంలో తీసుకెళ్తున్న గ్రనేడ్ల కారణంగానే పేలుడు సంభవించిందని ప్రచారం చేశారు. అయితే పుతిన్ వ్యాఖ్యలను ఖండించిన వాల్‌స్ట్రీట్ జర్నల్.. మాస్కో ఎయిర్‌పోర్టులో ప్రిగోజిన్ విమానం వేచివున్న సమయంలో విమానం రెక్కకు ఒక చిన్న బాంబును అతికించారని, దాని వలన పేలుడు జరిగిందని పేర్కొన్నది. కాగా, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ఒక కల్పన అని క్రెమిన్ ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

