Bittu Tabahi | ఒంటరిగా నదిని శుభ్రం చేసిన 21 ఏళ్ల యువకుడు.. డచ్ కంపెనీ నుంచి భారీ ఆఫర్!
మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి (Surendra Singh Choudhary aka Bittu Tabahi) తన సొంత చేతులతో ఒక నదిని శుభ్రం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
Bittu Tabahi | మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి (Surendra Singh Choudhary aka Bittu Tabahi) తన సొంత చేతులతో ఒక నదిని శుభ్రం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నదినే కాకుండా తన చుట్టు ప్రక్కాల ఉన్న మురికి కాలువలను కూడా అతడు శుభ్రం చేసి వైరల్‌గా మారాడు. అయితే బిట్టు పనితనాన్ని మెచ్చిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ (The Ocean Cleanup) వ్యవస్థాపకుడు, సీఈఓ బోయాన్ స్లాట్ (Boyan Slat) స్పందిస్తూ.. బిట్టుకు తన సంస్థలో ఉద్యోగం ఆఫర్ చేయడమే కాకుండా నెదర్లాండ్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
మధ్యప్రదేశ్‌లోని ‘అజ్నార్’ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో, మురికితో పూర్తిగా నిండిపోతే స్థానిక యంత్రాంగాలు పట్టించుకోలేదు. దీంతో 20 ఏళ్ల బిట్టు ఎలాంటి యంత్రాలు లేకుండా, తానొక్కడే సాహసించి దాదాపు 3 నెలల పాటు కష్టపడి ఆ నదిలోని చెత్తను పూర్తిగా తొలగించాడు. అయితే తాను చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. అయితే అతను పడిన కష్టానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం అతని నిబద్ధతను అభినందించారు. అతడి వీడియోలు వరల్డ్ వైడ్‌గా వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదులలోని ప్లాస్టిక్‌ను తొలగించే ప్రముఖ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ ఫౌండర్ బోయాన్ స్లాట్ బిట్టు చేసిన సాహసాన్ని గుర్తించారు. అతనికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ నెదర్లాండ్స్‌కు రావాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా ఆహ్వానం పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒంటరిగా చేసి చూపించిన ఒక సామా సాధారణ యువకుడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Influencer By Day, River Cleaner By Choice
Known online as Bittu_Tabahi, this Madhya Pradesh creator has been documenting a very different kind of project: cleaning a garbage-choked stretch of the Ajnar River, largely on his own.
No speeches. No big campaign. Just one person… pic.twitter.com/ujDwdcpeS6
— RT_India (@RT_India_news) September 3, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

