విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న ఒక వ్యక్తి.. మూడు గంటల ప్రయాణం తర్వాత మరో ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం ల్యాండింగ్ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. ఈ విమానం గాటిమాలా నుంచి మియామి వెళ్లింది.
అక్కడ విమానం ల్యాండయిన తర్వాత అతన్ని అధికారులు గుర్తించారు. వెంటనే పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు ల్యాండింగ్ గేర్‌లో దాక్కున్న ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిలో సదరు వ్యక్తితో.. ఇమిగ్రేషన్ అధికారులు మాట్లాడుతూ కనిపిస్తున్నారు.