కీవ్: థర్మోబారిక్ రాకెట్లను రష్యా ప్రయోగించింది. వీటినే వ్యాక్యుమ్ బాంబులు అంటారు. ఉక్రెయిన్‌లో వీటిని ప్రయోగించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా రిలీజైంది. డోనెస్కీ రిపబ్లిక్ ప్రాంతంలో రష్యాకు మద్దతు ఇచ్చే మిలిటెంట్లు ఈ బాంబులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన టీఓఎస్-1ఏ మల్టిపుల్ రాకెట్ లాంచర్ ద్వారా రాకెట్‌ను పేల్చారు. థర్మోబారిక్ ఆయుధాలు వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే అవి సాంప్రదాయ ఆయుధాల కన్నా ప్రమాదకరమైనవి. పేలుడు సమీపంలో ఉన్నవారిపై ఆ ఆయుధాలు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. వ్యాక్యుమ్ బాంబు వీడియో ఇదే.
The separatist DNR published a video showing Russian TOS-1A thermobaric MLRS firing on Ukrainian targets. https://t.co/vlhPBFOSan pic.twitter.com/Z2NROIX90s
— Rob Lee (@RALee85) March 20, 2022