టొరంటో, ఏప్రిల్ 8: అంగస్తంభన కోసం వాడే వయాగ్రాతో కంటిచూపు కోల్పోయే ప్రమాదమున్నదని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకులు తెలిపారు. వయాగ్రా వాడకంతో పురుషాంగానికి రక్తసరఫరా పెరుగుతుందని, ఇదే సమయంలో కంటికి నెత్తుటి సరఫరా తగ్గుతుందని పేర్కొన్నారు.
ఇది కంటిచూపు కోల్పోవడానికి దారితీయవచ్చని హెచ్చరించారు. రోజూ వయాగ్రా వాడితే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరించారు. 2.13 లక్షల మందిని పరీక్షించి ఈ వివరాలు వెల్లడించారు.