లండన్: యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లోని ఒక బృందం ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా ఏఐను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాను మనుషులపై ప్రయోగించినట్టు వెల్లడించింది. ఈ టీకాను అన్ని రకాల కరోనా వైరస్లు, మహమ్మారులు, జంతువులకు సోకే వైరస్లు, భవిష్యత్తులో మరో మహమ్మారిని సృష్టించే సామర్థ్యం ఉన్న వైరస్లను నిరోధించేందుకు ఉపయోగించవచ్చని ఆ బృందం తెలిపింది.
అయితే ఈ వ్యాక్సిన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. కానీ తాము దీన్ని పోలిన టీకాలను ఇప్పటికే అభివృద్ధి చేశామని.. అవి ఫ్లూ, ఎబోలాను నిరోధించవచ్చని వెల్లడించింది. కరోనా వైరస్ల నుంచి సేకరించిన జన్యు సంకేతాలను విశ్లేషించి ఈ కొత్త టీకాను తయారు చేశారు. వైరస్ల కుటుంబం రూపాంతరం చెందినా వాటి నుంచి రక్షణ లభించేలా సూపర్-యాంటీజెన్ లాగా రూపొందించారు.