టోక్యో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమిస్తే, అప్పుడు తాము సైనికపరంగా చైనాను అడ్డుకుంటామని ఆయన అన్నారు. టోక్యోలో పర్యటిస్తున్న బైడెన్ ఓ సమావేశంలో మాట్లాడారు. వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం చేశామని, కానీ బలవంతంగా తైవాన్ను లాక్కునేందుకు చూస్తే, దాన్ని అడ్డుకుంటామని బైడెన్ అన్నారు. ఒకవేళ చైనా అలా చేస్తే అప్పుడు ఈ ప్రాంతంలో శాంతి లోపిస్తుందని, ఉక్రెయిన్ తరహాలో ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని బైడెన్ అన్నారు. బలవంతంగా తైవాన్ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ అన్నారు.