Watch: మార్కర్ పెన్నును కత్తిగా పొరపడిన మహిళా పోలీస్.. కాల్పుల్లో వ్యక్తి మృతి
US Cop Fatally Shoots Man | ఒక వ్యక్తి చేతిలో మార్కర్ పెన్ను ఉంది. అయితే దానిని కత్తిగా పొరపడిన మహిళా పోలీస్ గన్‌తో కాల్పులు జరుపడంతో అతడు చనిపోయాడు. (US Cop Fatally Shoots Man ). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వాషింగ్టన్: ఒక వ్యక్తి చేతిలో మార్కర్ పెన్ను ఉంది. అయితే దానిని కత్తిగా పొరపడిన మహిళా పోలీస్ గన్‌తో కాల్పులు జరుపడంతో అతడు చనిపోయాడు. (US Cop Fatally Shoots Man ). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని డెన్వర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 5న నల్లజాతీయుడైన 36 ఏండ్ల బ్రాండన్ కోల్ తన భార్య, కుమారుడిపై గృహ హింసకు పాల్పడినట్లు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను వీల్‌ఛైర్ నుంచి అతడు తోసేసినట్లు ఆరోపించారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీల్‌ఛైర్ పక్కన ఒక మహిళ కూర్చొని ఉండటాన్ని గమనించారు. అయితే చేతుల్లో తుపాకులు పట్టుకున్న పోలీసులను చూసిన ఆ మహిళ తన భర్తపై కాల్పులు జరుపవద్దని అరిచింది. ఒక పోలీస్ స్టన్ గన్‌తో కోల్‌ను కొట్టేందుకు ప్రయత్నించాడు. తప్పించుకున్న అతడు అక్కడున్న కారు వద్దకు పారిపోయాడు.
మరోవైపు ఆ కారు పక్కన ఒక మహిళా పోలీస్ అధికారిణి ఉంది. కోల్ చేతిలో పట్టుకున్న మార్కర్ పెన్నును కత్తిగా ఆమె భావించింది. ఈ నేపథ్యంలో నల్లజాతీయుడైన కోల్‌పై గన్‌తో కాల్పులు జరిపింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు కిందపడిపోయాడు. అతడి చేతి నుంచి పడిన వస్తువును నల్ల మార్కర్ పెన్నుగా పోలీసులు గుర్తించారు. కోల్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, మహిళా పోలీస్ అధికారిణి డ్రెస్‌కు ఉన్న కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌ను పోలీసులు విడుదల చేశారు. ఆ పరిస్థితిలో నల్లజాతీయుడిపై కాల్పులు జరిపిన మహిళా పోలీస్ అధికారిణి చర్యను ఉన్నతాధికారి సమర్ధించారు. అయితే పోలీస్ నిబంధనలను ఆమె ఉల్లంఘించిందా లేదా అన్నదానిపై దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. దీని ఆధారంగా ఆ మహిళా పోలీస్ అధికారిణి
నేరారోపణలు ఎదుర్కొంటారా లేదా అన్నది జిల్లా అటార్నీ నిర్ణయిస్తారని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Black Man
- shoots
- US Cop
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

