US Visa | అమెరికా వీసాల రెన్యువల్ మరింత ఆలస్యం.. రెన్యువల్ విధానాన్ని మార్చిన ట్రంప్ సర్కారు
అమెరికా వీసాలు రెన్యువల్ చేసుకోవడానికి ఇక ఎదురుచూపులు మరింత పెరగనున్నాయి. హెచ్-1బీ, బీ1, బీ2 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను వ్యక్తిగత ఇంటర్వ్యూ అవసరం లేకుండా రెన్యువల్ చేసే డ్రాప్‌బాక్స్ విధానం అర్హతను అమెరికా మార్చింది.
- పర్యాటక, వ్యాపార వీసాలపైనా ప్రభావం
US Visa | వాషింగ్టన్, ఫిబ్రవరి 14: అమెరికా వీసాలు రెన్యువల్ చేసుకోవడానికి ఇక ఎదురుచూపులు మరింత పెరగనున్నాయి. హెచ్-1బీ, బీ1, బీ2 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను వ్యక్తిగత ఇంటర్వ్యూ అవసరం లేకుండా రెన్యువల్ చేసే డ్రాప్‌బాక్స్ విధానం అర్హతను అమెరికా మార్చింది. 12 నెలల్లోపు గడువు ముగిసిన వీసాలను అదే క్యాటగిరీలో రెన్యువల్ చేయించుకునే అవకాశం డ్రాప్‌బాక్స్ ద్వారా ఉండేది. అయితే, కొవిడ్ సమయంలో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ కావడంతో 12 నెలల పరిమితిని 48 నెలలకు పెంచారు. దీంతో హెచ్-1బీ, బీ1(వ్యాపార), బీ2(పర్యాటక), ఎల్-1 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిసి నాలుగేండ్లు అయినా అమెరికా కాన్సులేట్లలో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన అవసరం లేకుండానే డ్రాప్‌బాక్స్ ద్వారా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది.
ఇప్పుడు ఈ విధానాన్ని మరోసారి మార్చి, కొవిడ్‌కు ముందు ఉన్నట్టుగానే 12 నెలలకు కుదించారు. దీంతో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిసి 12 నెలలు దాటిన వారు వీసాలు రెన్యువల్ చేసుకోవడానికి మళ్లీ యూఎస్ కాన్సులేట్లలో ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. వీసాల రెన్యువల్ మరింత ఆలస్యం కానుంది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమలులోకి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stampede | తొక్కిసలాట జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి.. సురక్షితంగా ఎలా బయట పడాలి..?
Narsapur | నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి : వీడియో
IND vs NZ | భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న కివీస్.. 243 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్
Drinking water | ప్రమాదకరంగా హైదరాబాద్ నగరంలో తాగునీరు : వీడియో
Road accident | టోల్గేట్లో ఆగివున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. కారులోని నలుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

